మోహన్ కృష్ణ, సౌజన్య, హరిణి రెడ్డి హీరో హీరోయిన్స్ గా రూపొందుతున్న చిత్రం మోహనకృష్ణ గ్యాంగ్‌లీడర్. జై యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి క్రియేషన్స్ సమర్పణలో యస్.యం.కె.ఫిల్మ్స్ పతాకంపై, శ్రీ లక్ష్మణ్ దర్శకత్వంలో సింగూలూరి మోహన్ రావు నిర్మించిన చిత్రం. చిత్రబృందం పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి సీనియర్ హీరో సుమన్, ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్న కుమార్, నిర్మాత తుమ్మలపల్లి, రామసత్యనారాయణ, దర్గా చిన్నా (పహిల్వాన్), తెలంగాణ ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణ గౌడ్, నిర్మాత లక్ష్మీపతి, దిల్ రమేష్, గీతా సింగ్, పింగ్ పాంగ్ సూర్య, జగదీశ్వర్, మమత తదితరులు ముఖ్య అతిధులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగాదర్శకుడు మాట్లాడుతూ రైతు గొప్పదనం చాటిచెప్పే విధంగా మంచి కాన్సెప్ట్ తీసుకుని తెరకెక్కించిన సినిమా ఇది. సందేశంతో పాటు కమర్షియల్ అంశాలు కూడా వున్నాయి అన్నారు. వచ్చే నెల 7న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. హీరో సుమన్ మాట్లాడుతూ మొదట దర్శకుడు గ్యాంగ్ లీడర్ కథ చెప్పగానే నాకు చాలా బాగా నచ్చింది. రైతులు ఇబ్బందులు పడుతున్న ఒక బర్నింగ్ ఇష్యూపై నా క్యారెక్టర్ ఉంటుంది. రైతు పాత్రలో నటించినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే రైతులేని రాష్ట్రం లేదు, రైతులేని దేశం లేదు. కరోనా టైం లో మనము బయట పడ్డాము అంటే ఆది రైతు వలనే. వారి ద్వారానే మనందరికీ ఫుడ్ లభించింది. వారు చేసిన కష్టం ఎప్పటికీ మరువలేము. ఇలాంటి మంచి చిత్రంలో రైతు పాత్రలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు అన్నారు.
హీరో మోహన్ కృష్ణ మాట్లాడుతూ ప్రస్తుతం ఒక చిన్న పాయింట్ ను తీసుకొని సినిమా తీస్తున్న ఈ రోజుల్లో ఒక కొత్త కథను సెలెక్ట్ చేసుకొని ఒక రైతు మీద, ఫ్రెండ్స్ మీద, రాజకీయం, స్నేహం ఇలా ఒక ఐదు బర్నింగ్ ఇష్యుస్ గురించి ఈ సినిమాలో చూపించడం జరుగుతుంది. నేను హీరోగా నటించినా ఈ సినిమాకు అసలు హీరో సుమన్ గారే. తను ఇందులో చాలా బాగా నటించారు. ఈ సినిమాలో చాలామంది సీనియర్ ఆర్టిస్టులు నటించడం జరిగింది. ఇందులో ఉన్న ఆరు పాటలకు ఘనష్యామ్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. ఐదు ఫైట్స్ కు రామ్ సుంకర బాగా కంపోజ్ చేశారు అని అన్నారు.