Namaste NRI

ఉద్యోగులకు షాక్ ఇస్తున్న కంపెనీలు.. అమెరికాలో 98 శాతం పెరిగిన కోతలు

అమెరికా కంపెనీలు భారీగా ఉద్యోగులను తొలగిస్తున్నాయి. గత ఏడాది ఏకంగా 721,677 మందిపై వేటు వేశాయి. అంతకుమునుపు ఏడాది 363,832 మందిని తొలగించాయి. 2022తో పోలిస్తే 2023లో ఉద్యోగాల తొలగింపులు 98 శాతం పెరిగాయని ఛాలెంజర్‌, గ్రే అండ్‌ క్రిస్మస్‌ సంస్థ తాజా నివేదికలో వెల్లడించింది. ఆర్థిక అనిశ్చిత పరిస్థితుల కారణంగానే కంపెనీలు ఉద్యోగులపై వేటు వేస్తున్నాయని తెలిపింది.

అమెజాన్‌, మెటా వంటి టెక్‌ కంపెనీలే గత ఏడాది 1.68 లక్షల మందికి ఉద్వాసన పలికాయని పేర్కొన్నది. ఈ ఏడాది పరిస్థితులు మరింత అధ్వానంగా ఉండనున్నట్టు నిపుణులు అంచనావేస్తున్నారు. కృత్రిమ మేధ కారణంగా సాంకేతిక రంగం చెప్పుకోదగ్గ మార్పులకు లోను కావడం ఉద్యోగాలపై ప్రభావం చూపుతున్నది. రిటైల్‌ రంగంలోనూ గత ఏడాది 78,840 ఉద్యోగాలను కంపెనీలు తొలగించాయి. స్టోర్ల మూసివేత, దివాలా కూడా ఉద్యోగుల తొలగింపుపై ప్రభావం చూపుతున్నది. 2023లో 34 శాతం కంపెనీలు ఉద్యోగులకు బోనస్‌ ఇవ్వలేదు.

Social Share Spread Message

Latest News