Namaste NRI

కెనడాలో భారతీయ విద్యార్థుల ఆందోళన

విదేశీ చదువుల కోసం భారతీయులకున్న గమ్యస్థానాల్లో కెనడా ఒకటి. ఇతర దేశాల నుంచి  వచ్చేవారికి ఆ దేశమూ స్వాగతిస్తుంటుంది. అలాంటి అక్కడి ప్రిన్స్‌ ఎడ్వర్డ్‌ ఐలాండ్‌ ప్రావిన్స్‌ పరిస్థితిలో మార్పు వచ్చింది. స్థానికుల నుంచి వ్యతిరేకత దృష్ట్యా ఇటీవల ఇమిగ్రేషన్‌ నిబంధనల్లో స్థానిక ప్రభుత్వం మార్పులు చేపట్టింది. దీనిపై విదేశీ విద్యార్థులు, ముఖ్యంగా భారతీయ విద్యార్థులు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేయాల్సిన పరిస్థితి నెలకొంది.

కెనడాలోని అతి చిన్న ప్రావిన్స్‌ అయిన ప్రిన్స్‌ ఎడ్వర్డ్‌ ఐలాండ్‌లో గత కొంతకాలంగా వలసదారుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. వాస్తవంగా చదువుకోవడానికి వచ్చే విదేశీ విద్యార్థులు సాధారణంగా ఒంటారియో, బ్రిటీష్‌ కొలంబియా వంటి పేరున్న ప్రావిన్సుల్లోని విద్యా సంస్థల్లో తమ పేర్లను నమోదు చేసుకుంటారు. శాశ్వత నివాసం కోరుకునేవారు మాత్రం పోటీ దృష్ట్యా ప్రిన్స్‌ ఎడ్వర్డ్‌ ఐలాండ్స్‌ వంటి చిన్న  ప్రావిన్సులకు తరలిపో తుంటారు. దీనివల్ల ఇక్కడ వలసదారుల సంఖ్య పెరిగిపోతోంది. దీనిపై కెనడియన్లలో వ్యతిరేకత వ్యక్తమవ డంతో తాజాగా ప్రావిన్సియల్‌ నామినీ ప్రోగ్రామ్‌లో స్థానిక ప్రభుత్వం కొన్ని మార్పులు తీసుకొచ్చింది. ఇందులో భాగంగా హెల్త్‌కేర్‌, చైల్డ్‌కేర్‌, కన్‌స్ట్రక్షన్‌ రంగాల్లో ఉన్నవారికే శాశ్వత నివాసం విషయంలో ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించింది. దీంతో ఫుడ్‌, రిటైల్‌, సర్వీస్‌ సెక్టార్లలో పనిచేసే విద్యార్థుల పరిస్థితి అనిశ్చితిలో పడిరది. అందుకే అక్కడి భారతీయ విద్యార్థులు ఆందోళనలు చేస్తున్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events