వచ్చే నెలలో అమెరికాలో ఒక కీలక సమావేశానికి హాజరు కావాల్సిందిగా ప్రధాని నరేంద్ర మోదీకి ఆహ్వానం అందింది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఈ సమావేశానికి అధ్యక్షత వహించనున్నారు. ప్రజాస్వామ్యం కోసం సదస్సు పేరిట ఆ సమావేశం నిర్వహించబోతున్నారు. ప్రధాని మోదీ వర్చువల్ సమావేశంలో పాల్గొనవచ్చు. రెండు రోజుల పాటు సమావేశం ఉంటుంది.
డిసెంబర్ 9, 10 తేదీలో జరిగే ఈ సదస్సులో వివిధ దేశాధిపతులు, పౌర సమాజాలు, ప్రయివేటు రంగ నిపుణులకు ఆహ్వానాలు పంపారు. ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యానికి ఎదురవుతున్న కష్టనష్టాలను, సమస్యలను బెదిరింపులను సమగ్రంగా చర్చించి, వాటికి నివారణోపాయాలను కనుగొని, ఒక నిశ్చిత ఎజెండాలను తయారు చేయాలన్న సంక్పలంతో బో బైడెన్ ఈ భారీ సమావేశాన్ని సంకల్పించారు.