
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ జయకేతనం ఎగురవేశారు. తన సమీప ప్రత్యర్థి, బీఆర్‌ఎస్ అభ్యర్థి పై 25 వేల ఓట్లకు పైగా మెజార్టీతో ఆయన గెలుపొందారు. తొలి రౌండ్ నుంచే నవీన్ యాదవ్ స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించారు. రౌండ్ రౌండ్‌కూ ఆది మరింత పెరిగింది. ఏ ఒక్క రౌండ్‌లోనూ బీఆర్‌ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ఆధిక్యం దక్కించుకోలేకపోయారు. ఈ గెలుపు రేవంత్ రెడ్డి సర్కార్‌కు, కాంగ్రెస్ శ్రేణులకు ఎంతో ఉత్సాహానిచ్చింది.
















