Namaste NRI

బీఆర్ఎస్ లోనే తనపై కుట్రలు .. ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు

బిఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి, ఎమ్మెల్సీ పదవికి కల్వకుంట్ల కవిత రాజీనామా చేశారు. స్పీకర్‌ ఫార్మాట్‌లో రాజీనామాను మండలి చైర్మన్‌కు పంపించానని ఆమె తెలిపారు. ఈ సందర్భంగా జాగృతి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.బీఆర్ఎస్ లో తనపై కుట్రలు జరిగాయని,  రాబోయే రోజుల్లో కేసీఆర్, కేటీఆర్ లపై కూడా కుట్రలు జరుగుతాయని సంచలన వ్యాఖ్యలు చేశారు.  హరీశ్ రావు , సంతోష్ రావులపై తీవ్ర ఆరోపణలు చేశారు. వీరిద్దరూ బీఆర్  ఎస్ పార్టీని జలగల్లా పట్టిపీడిస్తున్నారని మండిపడ్డారు. సిరిసిల్లలో కేటీఆర్ ను ఓడించేందుకు ప్రత్యర్థులకు హరీశ్ రూ 60 లక్షలు పంపించారని ఆరోపించారు. ఈ విషయం తనకు తెలుసని చెప్పారు. కాంగ్రెస్, బీజేపీలతో హరీశ్, సంతోశ్ అంటకాగుతున్నారని దుయ్యబట్టిరు. సంతోష్ రావు బాధితులు చాలామంది తనకు ఫోనుళ్లొ చేస్తూ వారి బాధలను పంచుకుంటున్నారని కవిత అన్నారు.

బీఆర్ఎస్ ఉంటే ఎంత , లేకపోతే ఎంత అని తను ఎప్పుడూ అనలేదని చెప్పారు. కేసీఆర్ లేని బీఆర్ఎస్ ఉంటే ఎంత లేకపోతే ఎంత అని మాత్రమే తాను అన్నానని కవిత చెప్పారు. కేసీఆర్ కూతురుగా పుట్టిన తాను ఆయనను, పార్టీని ఎందుకు ఇబ్బంది పెట్టాలనుకుంటానని ప్రశ్నించారు. ఆరడుగుల బుల్లెట్టే (హరీశ్ రావు) తనను గాయపరిచిందని కవిత మండిపడ్డారు. వీళ్లు ఇతర రాష్ట్రాలకు వెళ్లి అక్కడి నుంచి కూడా కుట్రలు చేస్తారని అన్నారు.వీరివల్లే విజయశాంతి, మైనంపల్లి, ఈటల వంటి నేతలు పార్టీ నుంచి వెళ్లిపోయారని చెప్పారు. ఉప ఎన్నికల్లో ఈటలను హరీశ్ దగ్గరుండి గెలిపించారని అన్నారు. ఈ విషయాలన్నింటినీ ఇప్పటికైనా కేటీఆర్ గమనించాలని కవిత సూచించారు. పార్టీలో ఏం జరుగుతోంది చూడండి నాన్న, బీఆర్ఎస్ నేను హస్తగతం చేసుకునే కుట్రలు జరుగుతున్నాయి అని తన తండ్రిని కేసీఆర్ ను ఉద్దేశించి కవిత వ్యాఖ్యానించారు.

Social Share Spread Message

Latest News