
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా గద్దె దిగడం యాదృచ్ఛికంగా జరగలేదని, దీని వెనక కుట్ర ఉందని ఆ దేశ తాత్కాలిక చీఫ్ మహమ్మద్ యూనస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికాలో క్లింటన్ గ్లోబల్ ఇనిషియేటి వ్ వార్షిక సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ హసీనా గద్దె దిగి దేశాన్ని విడిచిపెట్టడంలో మాఫజ్ అబ్దులా హస్తం ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. రిజర్వేషన్ల అంశం దేశాన్ని కుదిపేసి హింసకు దారి తీయడంతో మరో దారిలేక హసీనా ప్రధాని పీఠం వదలి దేశం విడిచి భారత్ చేరుకుని ఆశ్రయం పొందుతున్నారు.
