బ్రిటన్‌లో కరోనా కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. నిన్న ఒక్క రోజులోనే 1,29,471 కేసులు నమోదయ్యాయి. గతవారం డిసెంబర్ 21న దేశంలో 90,625 కేసులు నమోదు కాగా, ఇప్పుడు ఏకంగా 42 శాతం పెరుగగడం ఆందోళన కలిగిస్తోంది. మొత్తంగా గత వారం రోజుల వ్యవధిలో 8 లక్షల మందికి పైగా వైరస్ బారినపడ్డాని, అంతకుముందు వారంతో పోలిస్తే ఇది 30.3 శాతం అధికమని అధికారులు తెలిపారు. కేసులు దారుణంగా పెరిగిపోతుండడంతో రూల్ ఆఫ్ సిక్స్‌ను తిరిగి తీసుకురావాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఆరోగ్య కార్యదర్శి సాజిద్ జావిద్ మాత్రం కొత్త సంవత్సరానికి ముందు ప్రజలపై ఎలాంటి కొత్త ఆంక్షలు విధించబోమని చెప్పడం గమనార్హం. ప్రభుత్వ కరోనా వైరస్ డ్యాష్‌బోర్డు ప్రకారం డిసెంబర్ 23 నాటికి పాజిటివ్ కేసుల వారం రోజుల రోలింగ్ రేటు ప్రతి లఞక్ష మందికి 1,145,4గా ఉంది.














