ప్రముఖ మలయాళీ సూపర్ స్టార్ మమ్ముట్టికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని ఆయన ట్విటర్ ద్వారా వెల్లడిరచారు. ఇటీవల తేలికపాటి జలుబు, గొంతునొప్పితో బాధపడుతున్నారు. ఈ క్రమంలో ఆయన పరీక్షలు చేయించుకోగా కరోనా సోకినట్లు తేలింది. అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ నాకు కరోనా సోకింది. వైద్యుల సలహాలు పాటిస్తూ ఇంట్లోనే ఐసోలేషన్‌లో ఉన్నాను. అందరూ క్షేమంగా ఉండండి. అన్ని వేళలా మాస్క్ ధరించండి. జాగ్రత్తగా ఉండండి అని మమ్ముట్టి ట్వీట్ చేశారు. మమ్ముట్టి ఆరోగ్య స్థితి బాగానే ఉందని వైద్యులు పేర్కొన్నారు. మమ్ముట్టికి కరోనా పాజిటివ్‌గా తేలడంతో ఆయన వేగంగా కోలుకోవాలని అభిమానులను ఆకాంక్షిస్తూ ట్వీట్ల చేస్తున్నారు.














