వికాస్ వశిష్ఠ, ప్రియా వడ్లమాని, చైతన్య రావ్, అయేషా ఖాన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ముఖచిత్రం. గంగాధర్ దర్శకుడు. ప్రదీప్ యాదవ్, మోహన్ యల్ల సంయుక్తంగా నిర్మించారు. హీరో విష్వక్ సేన్ కీలక పాత్ర పోషించారు. ఈ నేపథ్యంలోనే మైదరాబాద్‌లో చిత్ర ట్రైలర్ విడుదల చేశారు. చిత్ర దర్శకుడు గంగాధర్ మాట్లాడుతూ ఇది చిన్న చిత్రమైనా, విష్వక్ సేన్ వచ్చాక పెద్ద సినిమాగా మారింది అన్నారు. మంచి భావోద్వేగభరితమైన సినిమా చేశాం. కచ్చితంగా అందరి హృదయాల్ని హత్తుకునేలా ఉంటుంది అంది నాయిక ప్రియా వడ్లమాని. విశ్వక్‌సేన్ మాట్లాడుతూ ఈ సినిమా కథలో కొత్తదనం ఉంది. నా క్యారెక్టర్ కూడా విభిన్నంగా ఉంటుంది. థియేటర్లలో చూడాల్సిన సినిమా ఇది అని చెప్పారు. ఈ సినిమా ఈ నెల 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు కాలభైరవ పాల్గొన్నారు.