ఆది సాయికుమార్ హీరోగా ఫణి కృష్ణ సిరికి దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతోంది. దిగంగన సూర్య వంశి, మర్నా మీనన్ కథానాయికలు. ఈ సినిమాకి క్రేజీ ఫెలో అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ప్రచార చిత్రంలో ఆది చేష్టలు టైటిల్‌కు తగ్గట్లుగానే క్రేజీగా ఉన్నాయి. ఆద్యంతం వినోదాత్మకంగా సాగే చిత్రమిది. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఉంటుంది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని తెరకెకిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం హైదరాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటుంది. ప్రస్తుతం నిర్మాణాంతర పనులు జరుగుతున్నాయి అని చిత్ర బృందం తెలిపింది. కె.కె.రాధామోహన్ నిర్మాత. సంగీతం: ఆర్‌ఆర్ ధృవన్, ఛాయాగ్రహణం: సతీష్ ముత్యాల.














