Namaste NRI

సాయిధరమ్ తేజ్ విరూపాక్ష నుంచి క్రేజీ అప్‌డేట్

టాలీవుడ్ యువ హీరో సాయిధరమ్ తేజ్  నటిస్తున్న సినిమా  విరూపాక్ష. ఈ మూవీలో భీమ్లానాయక్ ఫేం సంయుక్తా మీనన్ ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది.  ఈ  చిత్రాన్నిశ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర-సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. బ్రహ్మాజీ, అజయ్, సునీల్ విరూపాక్షలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు.  తెలుగు, తమిళ భాషల్లో SDT15 చిత్రంగా వస్తోంది. ఇప్పటికే విరూపాక్ష టైటిల్ గ్లింప్స్   వీడియో విడుదల చేయగా,  నెట్టింట్లో వైరల్ అవుతోంది. కార్తీక్ దండు డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా నుంచి క్రేజీ అప్‌డేట్  అందించారు మేకర్స్. విరూపాక్ష ప్రపంచంలోకి వెళ్లేందుకు రెడీగా ఉండండి,  సుప్రీం హీరో విరూపాక్ష టీజర్ మార్చి 1న విడుదల కానుంది అంటూ మేకర్స్ టీజర్ అప్‌డేట్  ఇస్తూ ఓ వీడియో విడుదల చేశారు. కాంతార చిత్రానికి గూస్‌బంప్స్  తెప్పించే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించిన అంజనీశ్ లోక్నాథ్ ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events