Namaste NRI

క్రేజీ కల్యాణం.. నరేష్‌ బర్త్‌ డే సందర్భంగా స్పెషల్‌ పోస్టర్‌ రిలీజ్‌

సీనియర్‌ నటుడు నరేష్‌, తరుణ్‌ భాస్కర్‌, అనుపమ పరమేశ్వరన్‌, అఖిల్‌ ఉడ్డెమారి ప్రధానపాత్రధారులుగా రూపొందుతున్న ఫ్యామిలీ కామెడీ డ్రామా క్రేజీ కల్యాణం. బద్రప్ప గాజుల దర్శకుడు. బూసమ్‌ జగన్మోహన్‌రెడ్డి నిర్మాత. నిర్మాణం తుదిదశకు చేరుకున్న ఈ చిత్రం త్వరలో విడుదల కానున్నది. సీనియర్‌ నటుడు నరేష్‌ ఇందులో పర్వతాలు అనే పాత్ర పోషిస్తున్నారు. ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు శభాకాంక్షలు తెలుపుతూ, తాను పోషిస్తున్న పర్వతాలు పాత్రను పరిచయం చేస్తూ ఓ పోస్టర్‌ని మేకర్స్‌ విడుదల చేశారు. సంప్రదాయ వస్త్రధారణలో జోష్‌గా మూవ్‌ అవుతున్న నరేష్‌ను ఈ పోస్టర్‌లో చూడొచ్చు. పెళ్లి నేపథ్యంలో సాగే ఆసక్తికరమైన కథతో రూపొందుతున్న కంప్లీట్‌ ఎంటర్‌టైనర్‌ ఇదని, తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో చిత్రీకరణ జరిపామని మేకర్స్‌ తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: శ్యామ్‌ దూపాటి, సంగీతం: సురేష్‌ బొబ్బిలి, నిర్మాణం: యారో సినిమాస్‌.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events