Namaste NRI

అమెరికా ప్రతినిధుల సభ సభ్యుడిపై విమర్శలు…

అమెరికా ప్రతినిధుల సభ సభ్యుడు థామస్‌ మేసీ ప్రస్తుతం తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. క్రిస్మస్‌ సందర్భంగా ఆయన తన కుటుంబంతో కలిసి దిగిన ఫొటోనే ఇందుకు కారణం. ఆ ఫోటోలో మేసీ కుటుంబ సభ్యులందరూ గన్నులు చేతపట్టుకుని చిరునవ్వులు చిందిస్తూ ఫోజిచ్చారు. ఈ ఫొటోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన మేసీ శాంటా ఈ క్రిస్మస్‌కు బుల్లెట్లు తీసుకురా అంటూ ట్విటర్‌ పోస్ట్‌ పెట్టారు. మిచిగన్‌లో ఇటీవల ఓ హైస్కూల్‌లో జరిగిన కాల్పుల ఘటన మరవకముందే రిపబ్లికన్‌ నేత ఇలా వ్యవహరించడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతన్నాయి. తుపాకీ హింసకు గురైన బాధిత కుటుంబాలు థామస్‌ వైఖరిని ఖండిరచారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events