Namaste NRI

వహీదా రెహమాన్ కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు

బాలీవుడ్ లెజెండరీ నటి, డ్యాన్సర్ వహీదా రెహమాన్ కు దాదా సాహెబ్ ఫాల్కే లైఫ్టైమ్ అచీవ్మెంట్ అవార్డు వరించింది. 2023 సంవత్సరానికి గాను ఆమెకు ఈ అవార్డు దక్కినట్లు కేంద్ర సమాచారశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. భారతీయ చలనచిత్ర రంగానికి చేసిన కృషికి గుర్తుగా ఆమెకు ఈ అవార్డును బహూకరించనున్నట్లు మంత్రి వెల్లడించారు. వహీదా రెహమాన్ వయసు 85 ఏళ్లు. 69వ జాతీయ ఫిల్మ్ అవార్డ్స్ కార్యక్రమంలో వహీదాకు ఫాల్కే అవార్డును అందజేయనున్నారు. దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు కమిటీలోని అయిదుగురు సభ్యులు వహీదా రెహమాన్ పేరును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

ప్యాసా, కాగజ్ కే ఫూల్, చౌదవి కా చాంద్, సాహెబ్ బీవీ ఔర్ గులామ్ , గైడ్, ఖామోషి, ఢిల్లీ 6 వంటి చిత్రాలతో వహీదా రెహమాన్ మంచి గుర్తింపు తెచ్చుకుంది. చివరిసారిగా కమల్ హాసన్ విశ్వరూపం, స్కేటర్ గర్ల్ సినిమాలో వహీదా అతిథి పాత్రలో మెరిసింది. ఐదు దశాబ్దాల కాలంలో ఆమె దాదాపు 90కి పైగా సినిమాల్లో నటించారు. 1971లో ఉత్తమ నటిగా ఆమెకు జాతీయ అవార్డు వచ్చింది. 1972లో పద్మశ్రీ, 2011లో పద్మభూషణ్ అవార్డులు ఆమెను వరించాయి. నారీ శక్తి వందన్ బిల్లును పార్లమెంటు ఆమోదించిన తరుణంలోనే వహీదా రెహమాన్కు జీవిత సాఫల్య పురస్కారం రావడం అందరూ గర్వించదగిన విషయం.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events