
నటుడు కిరణ్ అబ్బవరం నటించిన చిత్రం క. నయన్ సారిక, తన్వీ రామ్ కథానాయికలు. ప్రతిష్టాత్మకంగా నిర్వహించే 15వ దాదా సాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్ లో ఉత్తమ చిత్రంగా క ఎంపికైంది. ఈ విషయాన్ని మీడియా ద్వారా తెలియజేస్తూ ఈ సినిమా టీమ్ ఆనందం వ్యక్తం చేశారు. నూతన దర్శకులు సుజిత్, సందీప్ దర్శకత్వంలో చింతా గోపాలకృష్ణరెడ్డి నిర్మించిన ఈ చిత్రం గత ఏడాది విడుదలై అఖండ విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. కర్మసిద్ధాంతం నేపథ్యంలో సాగే ఫాంటసీ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రం వాణిజ్యపరంగా విజయాన్ని సాధించడంతోపాటు విమర్శకుల ప్రశంసలందుకుంది.
