Namaste NRI

విజయ్ హీరోగా దళపతి 67 అప్‌డేట్ వచ్చేసింది

విజయ్ హీరోగా మరో సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రానికి  డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్.  దళపతి 67 గా తెరకెక్కుతున్న ఈ సినిమా అప్డేట్ వచ్చేసింది. సెవెన్ స్క్రీన్ స్టూడియో ఈ సినిమాను భారీ స్థాయిలో నిర్మించబోతుంది. ఈ  మూవీ షూటింగ్ జనవరి 2న గ్రాండ్గా మొదలైంది. మా ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌కు  సంబంధించిన అధికారిక సమాచారాన్ని మీ ముందుకు తీసుకురావడం చాలా ఎక్జయిటింగ్‌గా  ఉంది. విజయ్ సార్తో మూడోసారి సినిమా చేస్తుండటం సంతోషంగా ఉంది. అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నట్టు సెవెన్ స్క్రీన్ స్టూడియో తెలియజేసింది.

ఈ చిత్రానికి లోకేశ్ కనగరాజ్, రత్నకుమార్, ధీరజ్ వైడీ సంభాషణలు అందిస్తున్నారు. సతీశ్ కుమార్ ఆర్ట్ డైరెక్టర్ కాగా, అన్బరివ్ యాక్షన్ కొరియోగ్రఫర్గా పనిచేస్తున్నాడు. హీరోయిన్తోపాటు ఇతర నటీనటుల వివరాలపై త్వరలో క్లారిటీ ఇవ్వనున్నారు మేకర్స్ టీం. ఫిబ్రవరి మొదటి వారంలో ఈ  సినిమాకు సంబంధించిన ప్రకటన ఉండబోతుందని ఇటీవలే మైఖేల్ ప్రమోషనల్ ఈవెంట్లో ప్రకటించాడు లోకేశ్. మాస్టర్ సినిమా తర్వాత లోకేశ్-విజయ్ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events