Namaste NRI

ఆ టెక్నాలజీతో తమకు ప్రమాదం : అమెరికా

పాకిస్థాన్  తీరుపై అమెరికా శ్వేత‌సౌధం ఆందోళ‌న వ్య‌క్తం చేసింది. అత్యాధునిక క్షిప‌ణి టెక్నాల‌జీని పాకిస్థాన్ డెవ‌ల‌ప్ చేస్తున్న‌ట్లు వైట్‌హౌజ్ సీనియ‌ర్ అధికారి ఒక‌రు పేర్కొన్నారు. సుదీర్ఘ దూరం ప్ర‌యాణించే బాలిస్టిక్ క్షిప‌ణుల‌ను కూడా పాక్ అభివృద్ధి చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. ఆ టెక్నాల‌జీతో త‌మ‌కు కూడా ప్ర‌మాద‌క‌రంగా మార‌నున్న‌ట్లు అమెరికా చెప్పింది. పాకిస్థాన్‌కు చెందిన నాలుగు కంపెనీల‌పై ఇటీవ‌ల అమెరికా ఆంక్ష‌లు విధించింది. దాంట్లో ఆ స‌ర్కారు చెందిన నేష‌న‌ల్ డెవ‌ల‌ప్మెంట్ కాంప్లెక్స్ కూడా ఉన్న‌ది.

అమెరికా జాతీయ భ‌ద్ర‌తా స‌ల‌హాదారు జాన్ ఫిన‌ర్‌ పాకిస్థాన్ ప్రోగ్రామ్‌పై ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. పాక్ చేప‌డుతున్న లాంగ్ రేంజ్ మిస్సైల్ ప్రోగ్రామ్‌పై వ‌త్తిడి తెస్తున్నామ‌ని, ఆ స‌మ‌స్య‌ను తీర్చేందుకు దౌత్య విధానాన్ని కూడా అవ‌లంభిస్తున్న‌ట్లు ఫిన‌ర్ తెలిపారు. పాక్‌లోని ఎన్డీసీతో పాటు అక్త‌ర్ అండ్ స‌న్స్ ప్రైవేట్ లిమిటెడ్‌, అఫిలియేట్స్ ఇంట‌ర్నేష‌న‌ల్‌, రాక్‌సైడ్ ఎంట‌ర్‌ప్రైజ్ సంస్థ‌ల‌పై కూడా ఆంక్ష‌లు విధించారు. ఈ సంస్థ‌లు పాక్ బాలిస్టిక్ ప్రోగ్రామ్‌కు స‌హ‌క‌రిస్తున్న‌ట్లు తేలింద‌ని అమెరికా చెప్పింది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events

Powered by WordPress