Namaste NRI

విశ్వక్‌ సేన్‌ హీరోగా నటిస్తున్న దాస్‌ కా ధమ్కీ చిత్రం ప్రారంభం

విశ్వక్‌ సేన్‌, నివేదా పేతురాజ్‌ జంటగా నటిస్తున్న కొత్త సినిమా ధమ్కీ. ఈ చిత్ర షూటింగ్‌ ప్రారంభోత్సవం హైదరాబాద్‌లో జరిగింది. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ క్లాప్‌ కొట్టారు. ఎఫ్‌3 దర్శకుడు అనిల్‌ రావిపూడి కెమెరా స్విచ్చాన్‌తో పాటు గౌరవ దర్శకత్వం వహించారు. అనంతరం అల్లు అరవింద్‌ టైటిల్‌ లోగో ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా హీరో విశ్వక్‌ సేన్‌ మాట్లాడుతూ కృష్ణదాస్‌ అనే వెయిటర్‌ జీవితంలో జరిగే కథ ఇది. థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్‌తో పాటు వినోదాత్మకంగా సాగుతుంది. కథ వింటున్నప్పుడే చాలా నవ్వుకున్నాం. సినిమా చూశాక మీరు అలాగే నవ్వుతారని ఆశిస్తున్నాను. ఈ నెల 14 నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభించి మూడు నెలల్లో చిత్రీకరణ పూర్తి చేయాలని భావిస్తున్నాం అన్నారు. చిత్ర నిర్మాత కరాటే రాజు మాట్లాడుతూ ఫలక్‌నుమా దాస్‌ చిత్రం తర్వాత అదే టీమ్‌తో చేస్తున్న సినిమా ఇది. మా బ్యానర్‌లో మంచి వినోదాత్మకమైన సినిమాలను తీయాలని ప్రయత్నిస్తున్నామని తెలిపారు. చిత్ర దర్శకుడు నరేశ్‌ కుప్పిలి మాట్లాడుతూ పాగల్‌ తర్వాత విశ్వక్‌ సేన్‌తో మళ్లీ సినిమా చేయడం సంతోషంగా ఉంది. మంచి కంటెంట్‌ ఉన్న కథ ఇది అన్నారు.  ఈ చిత్రాన్ని వన్మయి క్రియేషన్స్‌ పతాకంపై కరాటే రాజు నిర్మిస్తున్నారు. నరేష్‌ కుప్పిలి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం : లియోన్‌ జేమ్స్‌, సినిమాటోగ్రఫీ: దినేష్‌ కె బాబు, ఆర్ట్‌: కె రామాంజనేయులు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events