Namaste NRI

పోరాటాలకు విరామం ఉండదనే కాన్సెఫ్టుతో దక్కన్ సర్కార్

కళా ఆర్ట్ బ్యానర్‌పై కళా శ్రీనివాస్ దర్శకత్వంలో చాణక్య, కియా రెడ్డి, మౌనిక హీరో హీరోయిన్ లుగా తెరకెక్కుతున్న మూవీ దక్కన్ సర్కార్.  ఈ సినిమా పోస్టర్‌, టీజర్‌ లాంచ్‌ కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా కళా శ్రీనివాస్‌ మాట్లాడుతూ  తెలంగాణ సంస్కృతి చాలా గొప్పది. ఈ నేలలో అంతర్లీనంగా అద్భుత శక్తి దాగుంది. తెలంగాణలోని ప్రతి అంశంపై సినిమా తీయొచ్చు. ఈ క్రమంలో తెలంగాణ ఉద్యమానికి తెరరూపాన్నిస్తూ చేసిన సినిమానే డెక్కన్‌ సర్కార్‌. పోరాటాలకు విరామం ఉండదనే కాన్సెప్ట్‌తో ఈ సినిమా చేశాను. తెలంగాణ ఆత్మను ఆవిష్కరించిన సినిమా ఇది. త్వరలో నిజామాబాద్‌లో ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ నిర్వహించనున్నాం  అని అన్నారు.  ఈ సినిమాలో భాగం అవ్వడం పట్ల ఘర్షణ శ్రీనివాస్‌, నటి హేమ ఆనందం వెలిబుచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుడు గాదె ఇన్నారెడ్డి, తెలంగాణ ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణ గౌడ్ పాల్గొని చిత్రయూనిట్‌ను అభినందించారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events