
ప్రముఖ విమానయాన సంస్థ ఎయిరిండియా సోమవారం కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ నుంచి అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీ కి నడిచే విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. సెప్టెంబర్ 1 నుంచి సర్వీసుల రద్దు అమల్లోకి వస్తుందని తెలిపింది. నిర్వహణాపరమైన కారణాలతోనే సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు ఎయిరిండియా ప్రకటించింది.
















