
వెనిజులాపై దాడి తర్వాత, గ్రీన్‌ల్యాండ్‌పై దాడి చేస్తామని అమెరికా బెదిరిస్తోంది. ఈ నేపథ్యంలో డెన్మార్క్ మంత్రిత్వశాఖ అమెరికాకు హెచ్చరికలు జారీ చేసింది. అమెరికా గ్రీన్‌ల్యాండ్‌పై దాడి చేస్తే, సైనికులు ముందుగా కాల్చి, తర్వాత ప్రశ్నిస్తారు అని డెన్మార్క్ మంత్రిత్వశాఖ పేర్కొంది. డెన్మార్క్ 1952 రూల్ ప్రకారం సైనికులు ఆదేశాల కోసం వేచి ఉండకుండా ఆక్రమణదారులపై దాడి చేయాలని నిర్దేశిస్తుంది. ట్రంప్ సైనిక బలగం చర్యకు, డెన్మార్క్ సైన్యం ప్రతిచర్యకు పాల్పడుతుందని ఆ దేశ విదేశాంగ మంత్రిత్వశాఖ పేర్కొంది.















