Namaste NRI

నల్లమల ట్రైలర్ ను విడుదల చేసిన దేవా కట్టా

నల్లమల అరణ్యంలో జరిగిన చీకటి కోణాల్ని ఆవిష్కరిస్తూ రూపొందించిన చిత్రం నల్లమల. ఈ చిత్ర ట్రైలర్‌ను ప్రముఖ దర్శకుడు దేవా కట్టా విడుదల చేశారు. చిత్ర దర్శకుడు రవిచరణ్‌ మాట్లాడుతూ పరాయి పాలన నుంచి విముక్తి పొంది భారతదేశం స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్న తరుణంలో నల్లమల అరణ్యంలోకి మనిషి రూపంలో ఓ క్రూర మృగం ప్రవేశిస్తుంది. ఆ తర్వాత జరిగే పరిణామాలేమిటన్నదే చిత్ర కథాంశం అన్నారు. ఈ సినిమాకు తాను హీరోను కాదని, కథే హీరో అని అమిత్‌ తివారీ తెలిపారు. ఈ సినిమాలోని ఏమున్నావే పిల్లా పాట చక్కటి ప్రజాదరణ పొందిందని సంగీత దర్శకుడు పీఆర్‌ పేర్కొన్నారు. అమిత్‌ తివారీ, భానుశ్రీ, నాజర్‌, తనికెళ్ల భరణి, అజయ్‌ఘోష్‌, కాలకేయ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా: వేణు మురళి, సంగీతం, పాటలు: పీఆర్‌, నిర్మాత: ఆర్‌.ఎమ్‌.కథ, మాటలు, స్క్రీన్‌ప్లే. దర్శకత్వం: రవి కిరణ్‌.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events