ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న చిత్రం దేవర. ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, సైఫ్ అలీ ఖాన్, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, షైన్ టామ్ చాకో, నరేన్, కలైయరసన్, అజయ్ మరియు అభిమన్యు సింగ్ కూడా కీలక పాత్రలలో నటించారు. ఇప్పటికే మూవీ నుంచి ట్రైలర్‌ను విడుదల చేయగా, రికార్డు వ్యూస్‌తో యూట్యూబ్‌లో దూసుకుపోతుంది. అయితే ఈ సినిమా నుంచి తాజాగా ఆయుధ పూజ సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఎర్రటి సంద్రం ఎగిసిపడే అద్దరి ఇద్దరి అద్దిరిపడే హోరు రణధీరుల పండగ నేడు. కత్తుల నెత్తుటి అలల తడే ఉప్పెన పెట్టుగ ఉలికిపడే జోరు మన జట్టుగ ఆడెను చూడు. హే ఉప్పూగాలే నిప్పుల్లో సెగలెత్తే హే డప్పూమోతలు దిక్కుల్లో ఎలుగెత్తే పులిబిడ్డల ఒంట్లో పూనకమే మొలకెత్తే పోరుగడ్డే అట్టా శిరసెత్తి శివమెత్తె అంటూ ఫుల్ మాస్ బీట్‌తో సాగిన ఈ పాట అభిమానులకు పండగ అని చెప్పుకోవాలి. ఈ పాటకు రామ జోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించగా, కాలా భైరవ పాడాడు. అనిరుధ్ సంగీతం అందించాడు. ఈ చిత్రం సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.