
రూపేష్ హీరోగా నటిస్తూ నిర్మిస్తున్న కుటుంబ కథాచిత్రం షష్టిపూర్తి. ఆకాంక్షసింగ్ కథానాయిక. రాజేంద్రప్రసాద్, అర్చన ముఖ్య పాత్రధారులు. పవన్ ప్రభ దర్శకుడు. ఇళయరాజా సంగీత దర్శకుడు. ఈ సినిమా కోసం కీరవాణి రాసిన ఏదో ఏ జన్మలోదో అంటూ సాగే గీతాన్ని ఇళయరాజా స్వరపరిచారు. ఆనన్యభట్ పాడారు. దేవిశ్రీప్రసాద్ పాటను విడుదల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ ఈ పాటలో కథంతా చెప్పాలి. అందుకే కీరవాణిగారిని రాయమని అడిగాం. ఇళయరాజా సంగీతంలో పాట అనగానే ఆయన ఆనందంగా ఒప్పుకున్నారు. గొప్పగా రాశారు అని తెలిపారు.
