సిద్ధాంత్ చతుర్వేది, త్రిప్తి డిమ్రి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ధడక్ 2. ఈ సినిమాకు షాజియా ఇక్బాల్ దర్శకత్వం వహించబోతుండగా, ధర్మ ప్రొడక్షన్స్ సమర్పణలో జీ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్ క్లౌడ్ 9 పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగష్టు 01న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్.

ట్రైలర్ చూస్తుంటే, ఈ చిత్రం నిలేష్ (సిద్ధాంత్ చతుర్వేది) విధి (త్రిప్తి డిమ్రీ) అనే ఇద్దరు ప్రేమికుల చుట్టూ తిరుగుతుంది. నిలేష్ అనే అణగారిన కులానికి చెందిన యువకుడు లా చదువుదామని న్యాయ కళాశాలలో జాయిన్ అవ్వగా, అతడికి విధి అనే ఉన్నత కులానికి చెందిన యువతి పరిచయమవుతుంది. వీరి స్నేహం కాస్తా ప్రేమగా మారాగా, ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఏంటి అనేది ఈ సినిమా కథ. చూస్తుంటే, తమిళ చిత్రం పరియేరుమ్ పెరుమాళ్ కి రీమేక్‌గా ఈ చిత్రం రాబోతున్నట్లు తెలుస్తుంది.
















