సంపూర్ణేష్‌బాబు, సోనాక్షి జంటగా నటిస్తున్న చిత్రం ధగడ్ సాంబ. సంపూర్ణేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా ట్రైలర్‌ను నటుడు సాయికుమార్ విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రెండున్నర గంటలపాటు హాయిగా నవ్వుకునేలా ఉంటాయి సంపూర్ణేష్‌బాబు సినిమాలు. ట్రైలర్ చాలా బాగుంది. యాక్షన్ కూడా బాగా చేశాడు. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు ఎన్ఆర్ రెడ్డి మాట్లాడుతూ సంపూర్ణేష్ బాబును ఇప్పటిదాకా చూడని కొత్త పాత్రలో చూస్తారు. అసభ్యత లేకుండా కుటుంబమంతా కలిసి చూసేలా కథ కథనాలు ఉంటాయి. నాలుగు ఫైట్స్‌ను నలుగు స్టంట్ మాస్టర్స్‌తో చేయించాం. ఈ నెల 20న చిత్రాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాం అన్నారు. ఇప్పటివరకు కామెడీ సినిమాలు చేసిన నేను ఈ సినిమాలో సీరియస్‌గా సాగే విభిన్నమైన కథని ఎంచుకుని చేశా అన్నారు సంపూర్ణేష్ బాబు. జ్యోతి, చలాకీ చంటి, మిర్చి మాధవి, ఆనంద్ భారతి తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ముజీకర్ మాలిక్, సంగీతం: డేవిడ్. జి. ఈ చిత్రాన్ని బీఎస్ రాజు సమర్పణలో ప్రవీణ్ క్రియేషన్స్ బ్యానర్‌పై ఆర్ఆర్బీహెచ్ శ్రీనుకుమార్ రాజు నిర్మిస్తున్నారు. ఎన్ఆర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. సెన్సార్ కార్యక్రమలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ నెల 20న విడుదలకు సిద్ధమవుతున్నది.














