రవితేజ, శ్రీలీల జంటగా త్రినాథ రావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ధమాకా. హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ వేడుకకు జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన దర్శకుడు రాఘవేంద్ర రావు మాట్లాడుతూ నేను దర్శకత్వం వహించిన అల్లరి ప్రియుడు చిత్రంలో రవితేజ డ్రమ్మర్‌గా చిన్న పాత్ర చేశాడు. అప్పుడే అతని ఎనర్జీ చూసి మాస్ మహారాజ్ అవుతాడని ఊహించా అని అన్నారు. రవితేజ మాట్లాడుతూ ఈ సినిమా ఖచ్చితంగా బాగుంటుంది. రైటర్ ప్రసన్నకుమార్ కామెడీ నాకు చాలా ఇష్టం. అతను అద్భుతమైన సంభాషణలు రాశాడు. పాత చిత్రాల్లో రావు గోపాలరావు, అల్లు రామలింగయ్య కాంబినేషన్ తరహాలో ఈ సినిమాలో రావు రమేష్, ఆది కాంబో సరదాగా ఉంటుంది. భీమ్స్ పాటలు ఉర్రూతలూగిస్తున్నాయి. ఆయనకు మంచి పేరు తెచ్చి పెట్టే చిత్రమవుతుంది. ఈ సంస్థలో నేను సినిమాలు చేస్తూనే ఉంటా అన్నారు. దర్శకుడు త్రినాథరావు నక్కిన మాట్లాడుతూ నేను రవితేజ ప్యాన్, ఆయన ఏం చేస్తే థియేటర్‌లో ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తారో నాకు తెలుగు. డైలాగులు అదిరిపోతాయి. ఈ సినిమా అంచనాలకు మించి ఉంటుందని అన్నారు. టీజీ విశ్వప్రసాద్ మాట్లాడుతూ ఎలాంటి నేపథ్యం లేకుండా ఇండస్ట్రీలో పైకొచ్చిన రవితేజ అందరికి స్ఫూర్తిగా నిలుస్తాడనని అన్నారు. ఈ వేడుకలో దర్శకుడు మారుతి, సముద్రఖని, అభిషేక్ అగర్వాల్ తదితరులు పాల్గొన్నారు.