దక్షిణాదిలో మరో ప్రతిష్టాత్మక మల్టీస్టారర్ సినిమా పట్టాలెక్కింది. నాగార్జున, ధనుష్ ప్రధాన పాత్రల్లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఘనంగా ప్రారంభోత్సవం జరుపుకుంది. శ్రీవెంకటేశ్వర సినిమాస్, అమిగోస్ క్రియేషన్స్ పతాకాలపై సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు నిర్మిస్తున్నారు. పూజా కార్యక్రమాల అనంతరం ధనుష్‌పై చిత్రీకరించిన సన్నివేశాలతో రెగ్యులర్ షూటింగ్‌ను మొదలుపెట్టారు. రష్మిక మందన్న కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: నికేత్ బొమ్మి, ప్రొడక్షన్ డిజైన్: రామకృష్ణ, మోనికా నిగోత్రే, సమర్పణ: సోనాలి నారంగ్, దర్శకత్వం: శేఖర్ కమ్ముల.
