ధనుష్ కథానాయకుడిగా వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్న ద్విభాషా చిత్రం సార్. సంయుక్తా మేనన్ కథానాయిక. ఎస్.నాగవంశీ, సాయి సౌజన్య, సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సాయికుమార్, తనికెళ్ల భరణి, సముద్రఖని ముఖ్య పాత్రలు పోషిస్తున్నార. ఈ సినిమాని డిసెంబర్ 2న విడుదల చేయనున్నట్లు గతంలో ప్రకటించారు. కానీ ఇప్పుడీ చిత్రం వాయిదా పడిరది. దీన్ని వచ్చే ఏడాది ఫిబ్రవరి 17న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు కొత్త విడుదల తేదీతో కూడిన రెండు పోస్టర్లను సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకున్నారు. విద్యావ్యవస్థ తీరు తెన్పులపై సాగే ఈ చిత్రంలో స్పృశించే అంశాలు ఆసక్తికరంగా ఉండటమే కాగా. ఆలోచింపజేస్తాయి. ఈ సినిమా ప్రస్తుతం ముగింపు దశలో ఉంది అని చిత్ర వర్గాలు తెలిపాయి. ఈ సినిమాకి జి.వి.ప్రకాష్ కుమార్ స్వరాలందిస్తున్నారు. జె.యువరాజ్ ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు.