చేతన్‌కృష్ణ, హెబ్బాపటేల్ జంటగా రూపొందుతోన్న చిత్రం ధూం ధాం. సాయికిశోర్ మచ్చా దర్శకుడు. ఎం.ఎస్.రామ్‌కుమార్ నిర్మాత. సాయికుమార్, వెన్నెల కిశోర్, పృథ్వీరాజ్, గోపరాజు రమణ, శివన్నారాయణ, బెనర్జీ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. హోలీ పర్వదినం సందర్భంగా ఈ సినిమాకు సంబంధిం చిన కొత్త పోస్టర్‌ని మేకర్స్ విడుదల చేశారు. ఫారిన్ లొకేషన్స్‌లో చేతన్‌కృష్ణ, హెబ్బాపటేల్ జంటగా నడుచు కుంటూ వస్తున్న స్టిల్‌ను ఈ పోస్టర్‌లో రివీల్ చేశారు.లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా అన్ని వర్గాల ప్రేక్షకులనూ ఆకట్టుకునేలా ఈ సినిమా తెరకెక్కుతున్నదని, త్వరలోనే థియేట్రికల్ రిలీజ్ డేట్‌ని ప్రకటిస్తా మని నిర్మాత తెలిపారు. చిత్రీకరణ దశలో ఉన్న ఈ చిత్రం సమ్మర్‌లో విడుదల కానుంది. ఈ చిత్రానికి కెమెరా: సిద్దార్థ్ రామస్వామి, సంగీతం: గోపీసుందర్.