Namaste NRI

ధూం ధాం టీజర్ విడుదల

చేతన్‌కృష్ణ, హెబ్బా పటేల్‌ జంటగా నటిస్తున్న చిత్రం ధూం ధాం. సాయికిషోర్‌ మచ్చా దర్శకత్వం. రామ్‌ కుమార్‌ నిర్మాత. ఈ చిత్రానికి గోపీమోహన్‌ స్టోరీ, స్క్రీన్‌ప్లే అందించారు. ఈ చిత్ర టీజర్‌ను హీరో గోపీచంద్‌, దర్శకుడు శ్రీనువైట్ల విడుదల చేశారు.ఈ సందర్భంగా శ్రీనువైట్ల మాట్లాడుతూ సినిమా ట్రైలర్‌ బాగుందని, తన దగ్గర ఎన్నో విజయవంతమైన చిత్రాలకు రచయితగా పనిచేసిన గోపీమోహన్‌ కథ, స్క్రీన్‌ప్లే ఈ సినిమాకు ప్రధానబలంగా నిలిచిందని అన్నారు.

నిర్మాత రామ్‌కుమార్‌ సినిమా అంటే మంచి పాషన్‌ కలిగిన ప్రొడ్యూసర్‌ అని, గోపీమోహన్‌ మంచి కథనిచ్చారని హీరో గోపీచంద్‌ తెలిపారు. చక్కటి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని రూపొందించామని, గోపీమోహన్‌ కథ ఆకట్టుకుంటుందని నిర్మాత ఎం.ఎస్‌.రామ్‌కుమార్‌ పేర్కొన్నారు.  సెప్టెంబర్‌ 13న ప్రేక్షకుల ముందుకురా నుంది. ఈ చిత్రానికి సంగీతం: గోపీసుందర్‌, దర్శకత్వం: సాయికిషోర్‌ మచ్చా.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events

Powered by WordPress