Namaste NRI

ట్రంప్, పుతిన్ అలాస్కా వేదికగా జరిగిన భేటీ ఫలించిందా..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, రష్యా అధ్యక్షుడు పుతిన్‌ అలాస్కా వేదికగా జరిగిన కీలక భేటీ ముగిసింది. అయితే ఉక్రెయిన్‌ యుద్ధానికి సంబంధించి ఎలాంటి ఒప్పందం కుదరకుండానే చర్చలు ముగిశాయి. అనంతరం ప్రెస్‌ కాన్ఫరెన్స్‌ లో ఇరువురు నేతలు భేటీ వివరాలను వెల్లడిరచారు. ఈ సందర్భంగా ట్రంప్‌ మాట్లాడుతూ సమావేశం ఫలప్రదమైందని పేర్కొన్నారు. భేటీలో అనేక అంశాలు చర్చకు వచ్చాయని తెలిపారు. ఈ చర్చల్లో ఎంతో పురోగతి ఉందన్నారు. అయితే కొన్ని సమస్యలను పరిష్కరించుకోవాల్సి ఉందని వెల్లడిరచారు. తుది ఒప్పందం మాత్రం కుదరలేదన్నారు. చాలా అంశాలను ఇద్దరం అంగీకరించామని, అయితే కొన్ని ఇంకా మిగిలే ఉన్నాయన్నారు. అన్ని విషయాలను పరిష్కరించుకోవాల్సి ఉందని వెల్లడిరచారు. తుది ఒప్పందం మాత్రం కుదరలేదన్నారు.చాలా అంశాలను ఇద్దరం అంగీకరించామని, అయితే కొన్ని ఇంకా మిగిలే ఉన్నాయన్నారు. అన్ని విషయాలను పరిష్కరించుకొని అధికారికంగా అగ్రిమెంట్‌పై సంతకం చేసే వరకు ఒప్పదం జరగదన్నారు. త్వరలో తాను ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ యురోపియన్‌ యూనియన్‌ నేతలతో మాట్లాడతానని ట్రంప్‌ తెలిపారు. మళ్లీ పుతిన్‌ను కలుస్తానని చెప్పగా, తదుపరి సమావేశంలో మాస్కోలో అని పుతిన్‌ పేర్కొన్నారు.


అనంతరం పుతిన్‌ మాట్లాడుతూ అలాస్కా సమావేశం చాలా నిర్మాణాత్మకంగా జరిగిందన్నారు. ఉక్రెయిన్‌తో యుద్ధం ముగించేందుకు తాను నిజాయతీగా ఉన్నట్లు తెలిపారు. ఈ సమావేశం వివాదానికి ముగింపు పలకడానికి ప్రారంభ స్థానంగా అభివర్ణించారు. ఈ సందర్బంగా ట్రంప్‌నకు ధన్యవాదాలు తెలిపారు. ట్రంప్‌తో తనకున్న సంబంధం వ్యాపారం లాంటిదని పేర్కొన్నారు. ఇరుదేశాల మధ్య సంబంధాల విషయాలలో క్లిష్టకాలంలో అధ్యక్షుడు ట్రంప్‌తో మాస్కో మంచి సంబంధాలు ఏర్పరచుకుందని వెల్లడిరచారు. ట్రంప్‌ అధికారంలో ఉండి ఉంటే ఉక్రెయిన్‌తో రష్యాకు యుద్ధం వచ్చి ఉండేది కాదని పుతిన్‌ మరో మారు పేర్కొన్నారు.


Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events