Namaste NRI

మిరాయ్‌ టీమ్‌ను అభినందించిన దిల్‌రాజు

మిరాయి సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు తేజ సజ్జా. ఢిల్లీ భామ రితికా నాయక్ ఫీమేల్ లీడ్ రోల్‌లో నటించగా, మంచు మనోజ్‌ కీ రోల్‌ పోషించాడు. ఈ మూవీ బాక్సాఫీస్‌పై దండయాత్ర చేస్తూ తెలుగుతో పాటు విడుదలైన అన్ని భాషల్లో సక్సెస్‌ఫుల్‌ టాక్‌ తెచ్చుకొని నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. సుమారు 60 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన మిరాయి పాన్ ఇండియా మార్కెట్‌లో బాక్సాఫీస్‌ వద్ద రూ.140 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టి టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచింది. ఈ మూవీ టీం సక్సెస్‌ను ఫుల్ ఎంజాయ్ చేస్తోంది.

టాప్‌ ప్రొడ్యూసర్‌ దిల్‌ రాజు మిరాయి టీంతో కలిసి సక్సెస్‌ను సెలబ్రేట్ చేసుకున్నారు. దిల్‌ రాజు నివాసంలో తేజ సజ్జా, డైరెక్టర్ అండ్ టీం కేక్‌ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకున్నారు. టీం మెంబర్స్‌ అంతా శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మూవీకి సీక్వెల్‌ రానుండగా, మిరాయి : జైత్రయా టైటిల్‌ను ఫిక్స్ చేశారు మేకర్స్‌. సీక్వెల్ పార్టులో టాలీవుడ్‌ యాక్టర్‌ రానా దగ్గుబాటి కీలక పాత్రలో కనిపించబోతున్నాడని వార్తలు వస్తుండగా, రానున్న రోజుల్లో క్లారిటీ వస్తుందో చూడాలి.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events