ఎంటర్‌టైన్‌మెంట్ రంగ దిగ్గజం డిస్నీ 4వేల మంది ఉద్యోగులను తొలగించాలని యోచిస్తున్నది. రిట్రెంచ్ చేయాల్సి ఉద్యోగులను గుర్తించాలని కంపెనీ మేనేజర్లను ఆదేశించినట్లు సమాచారం. ఏప్రిల్‌లో కంపెనీ తొలగింపులను చేపట్టనున్నది. అయితే, ఉద్యోగుల తొలగింపు చిన్న చిన్న గ్రూప్‌లుగా తొలగిస్తారా? లేదంటే ఒకేసారి నాలుగువేల మందిని ఇంటికి పంపుతారా? అన్న విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. వాస్తవానికి కంపెనీ ఏడు బిలియన్ డాలర్లు చేయాలని భావిస్తుందని, ఇదే తొలగింపులకు కారణంగా తెలుస్తున్నది. ఎంటర్‌టైన్‌మెంట్ కంపెనీ తన స్ట్రీమింగ్ సర్వీస్ హులుపై దృష్టి పెట్టి, స్ట్రీమింగ్ సర్వీస్ బిజినెస్‌ను తగ్గించుకునే అవకాశం ఉన్నట్లుగా నివేదికలు పేర్కొంటున్నాయి. ఏప్రిల్ 3న డిస్నీ వార్షిక సమావేశం జరగనుంది.