తెలంగాణలో ఇటీవల తుఫాను వరద తాకిడికి గురై నష్టపోయిన ఖమ్మం రూరల్ మండలం ఉన్నత పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులకు తానా ఫౌండేషన్ సభ్యులు చేయూత అందించారు. పాఠశాలలో చదువుతున్న 200 మంది విద్యార్థుల తల్లిదండ్రులను పాఠశాలకు పిలిచి నిత్యావసర సరుకులు, దుప్పట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి అవసరమైన రూ.2.15 లక్షల మొత్తాన్ని తానా ఫౌండేషన్ చైర్మన్ శశికాంత్ వల్లేపల్లి అందజేశారు. తానా ఫౌండేషన్ ద్వారా బాధితులకు అందజేశారు.


ఈ కార్యక్రమంలో తానా ఫౌండేషన్ తరపున బాధ్యులు బండి నాగేశ్వరరావు, జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీ సోమశేఖర శర్మ, ఖమ్మం అర్బన్ విద్యాధికారి రాములు, ఖమ్మం రూరల్ ఎంఈవో శ్రీనివాస్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శాంసన్, బయ్యన బాబూరావు, బోనాల రామకృష్ణ, ఇతర ఫౌండేషన్ సభ్యులు కృష్ణా రావు, శ్రీదేవీ, పాఠశాల ఉపాధ్యాయులు, 200 మంది విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
