
జర్మనీలోని వీస్‌బాడస్‌లో భారత వాసీ జర్మనీ అసోసియేషన్ మొయిన్జ్ / వీస్‌బాడెన్ ప్రాంతాల నేతృత్వంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారితోపాటు ఇతర రాష్ట్రాల ప్రజలంతా కలిసి దీపావళి వేడుకలను కనులపండువగా నిర్వహించారు. భారత కాన్సులేట్ జనరల్ సంజయ్ జైస్వాల్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరై దీప ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా ఒడిశాలో విద్య, వైద్య రంగాల్లో సుస్థిర అభివృద్ధికి కృషిచేసిన ఉర్సులా హెరాల్డ్, భారత్‌లో చిన్నారుల సంక్షేమానికి కృషిచేసిన డాక్టర్ మెడ్ గుంథర్ స్పాన్‌ను నిర్వాహకులు సన్నానించారు. అనంతరం వేడుకల్లో తెలంగాణలోని కరీంనగర్ జిల్లాకు చెందిన బి.అనన్య తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ బాషల్లో పాటలు పాడి అలరించారు. సంప్రదాయ నృత్య ప్రదర్శనలు అలరించాయి.ఈ వేడుకల్లో 400 భారతీయ కుటుంబాలు పాల్గొన్నాయి.


















