తెలుగు అసోసియేషన్ స్విట్జర్లాండ్ వారి ఆధ్వర్యంలో నవంబర్ 21న జ్యురీచ్లో దీపావళి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. తెలుగు అసోసియేషన్ స్విట్జర్లాండ్ ప్రెసిడెంట్ కడలి గనికాంబ, జనరల్ సెక్రటరీ కిశోర్ తాటికొండ, ఇతర తెలుగు అసోసియేషన్ సభ్యుల సహకారంతో దీపావళి వేడుకలను నిర్వహించారు. సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటపాటలతో వేడుకలు కనువిందుగా కొనసాగాయి. ఈ వేడుకల్లో 150 మంది తెలుగువారు పాల్గొన్నారు. దీపావళి వేడుకల నేపథ్యంలో చిన్నారులు ఉత్సాహంగా బాణాసంచా కాల్చి ఎంజాయ్ చేశారు. ఈ వేడుకల్లో తెలుగు ప్రజలందరూ పాల్గొని ఎంజాయ్ చేశారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/shankar-300x160.jpg)