ప్రపంచంలో శాంతి వర్ధిల్లేలా ఏ దేశమూ మరొకరిపై ఆటం బాంబులతో దాడికి పాల్పడకుండా ఉండేలా భూమ్మీద అణ్యాయుధాల నియంత్రణ కోసం తీవ్రంగా పాటుపడుతోన్న అగ్రరాజ్యం అమెరికా ఆ దిశగా మరో సంచలన అడుగు వేసింది. అమెరికా ప్రభుత్వం తమ వద్ద ఉన్న అణు బాంబుల సంఖ్యను వెల్లడిరచింది. గత నాలుగేళ్లలో ప్రకటించడం ఇదే తొలిసారి. అణ్వాయుధాల డేటాను వెల్లడిరచేందుకు మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. గత ఏడాది సెప్టెంబర్ 30 నాటికి అమెరికా వద్ద 3,750 అణ్వాయుధాలు ఉన్నట్లు ఆ దేశ సైన్యం తెలిపింది. 2019తో పోలిస్తే ఆ సంఖ్య 55 తక్కువే. ఇక 2017తో పొలిస్తే 72 తక్కువగా ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడిరచాయి. 1967లో రష్యాతో ప్రచ్ఛన్న యుద్ధం మొదలైన తర్వాత అమెరికా తన అణ్యాయుధ సామర్థ్యాన్ని పెంచుకున్నది. ఒకప్పుడు అమెరికా వద్ద 31,255 అణుబాంబులు ఉండేవి. కానీ ఇప్పుడు ఆ సంఖ్య క్రమంగా పడిపోయింది. రష్యాతో ఆయుధ నియంత్రణపై చర్చలు నిర్వహించనున్న నేపథ్యంతో బైడెన్ ప్రభుత్వం అణుబాంబుల సంఖ్యను ప్రకటించింది. నిరాయుధీకరణలో పారదర్శకత అవసరమని ప్రభుత్వం వెల్లడిరచింది.
ఈ ఏడాది జనవరి నాటికి అమెరికా వద్ద 5,550, రష్యా వద్ద 6255, చైనా వద్ద 350, బ్రిటన్ వద్ద 225, ఫ్రాన్స్ 290 అణుబాంబులు ఉన్నాయి. ఇండియా, పాకిస్థాన్ ఇజ్రాయిల్, నార్త్ కొరియా వద్ద మొత్తం కలిపి 460 న్యూక్లియర్ వార్ హెడ్స్ ఉన్నట్లు స్టాక్హొమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసర్చ్ ఇన్స్టిట్యూట్ తెలిపింది.














