భారత ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. అయితే అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ కోసం మోదీ ప్రత్యేకమైన బహుమతులను తీసుకెళ్లారు. కమలా హ్యారిస్‌ను కలిసిన సందర్భంగా ఆమెకు తన తాతకు సంబంధించిన పాత నోటిఫికేషన్ల కాపీని బహుమతిగా ఇచ్చారు. చేత్తో తయారుచేసిన ఓ వుడెన్ ప్రేమ్‌లో పెట్టి వీటిని ఆమెకు అందించారు. కమలా తాతా పేరు పీవీ గోపాలన్. ఆయన ఇండియాలో వివిధ ప్రభుత్వ సర్వీసుల్లో పని చేశారు. ఈ వుడెన్ ప్రేమ్‌తో పాటు గులాబీ మీనాకరీ చెస్ సెట్‌ను కూడా కమలా హ్యారిస్‌కు మోదీ గిప్ట్‌గా ఇచ్చారు. ఈ చెస్ సెట్ ప్రపంచంలోని పురాతన నగరాల్లో ఒకటైన కాశీలో తయారు కావడం విశేషం. ఈ చెస్ సెట్‌లోని ప్రతి భాగాన్ని చేత్తో తయారు చేశారు.