ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన అంతర్జాతీయ విమానాశ్రయాన్ని దుబాయ్‌లో నిర్మించబోతున్నారు. ప్రస్తుతం ఈ నగరంలోని విమానాశ్రయానికి ఐదు రెట్లు పెద్దదైన ఎయిర్‌పోర్ట్ త్వరలో ఇక్కడ ఏర్పాటు కాబోతున్నది. ఈ విషయాన్ని దుబాయ్ రాజు షేక్ మహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తోమ్ ప్రకటించారు. 35 బిలియన్ డాలర్లు (రూ.2.9 లక్షల కోట్లు) ఖర్చుతో అల్ మక్తోమ్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ నిర్మాణాన్ని చేపడుతున్నట్టు ఆయన తెలిపారు. 5 సమాంతర రన్‌వేలు, 400 ఎయిర్‌క్రాఫ్ట్ గేట్స్, 26 కోట్లమంది ప్రయాణికుల సామర్థ్యం(ఒక ఏడాదిలో) దీని ప్రత్యేకతలుగా చెప్పారు.