దేశంలో అత్యధిక వేతనం అందుకుంటున్న టాప్-10 సీఈవోల్లో ఏడుగురు ఐటీ రంగానికి చెందినవారే ఉన్నారు. ఎకనామిక్ టైమ్స్ సేకరించిన వివరాల ప్రకారం విప్రో సీఈవో థియేర్రీ డెలపోర్టే రూ.82 కోట్ల వార్షిక వేతనంతో దేశంలో అత్యధిక వేతనం తీసుకుంటున్న సీఈవోగా టాప్ ప్లేస్‌లో నిలిచారు.ఇన్ఫోసిస్ సీఈవో సలీల్ పరేఖ్ రూ.56.45 కోట్ల వార్షిక వేతనంతో జాబితాలో రెండో స్థానంలో ఉన్నారు. టెక్ మహీంద్రా సీఈవో సీపీ గుర్నానీ రూ.30 కోట్లు, టీసీఎస్ సీఈవో రాజేష్ గోపినాథన్ రూ.29 కోట్ల వార్షిక వేతనాలతో జాబితాలో ఆ తర్వాత స్థానాల్లో నిలిచారు. ఇక హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ సీఈవో & ఎమ్‌డీ సీ విజయ్‌కుమార్ రూ.28 కోట్ల వార్షిక వేతనంతో జాబితాలో 11వ స్థానంలో ఉన్నారు.
