ప్రపంచంలో బ్రిటన్ రాయల్ ఫ్యామిలీ అపారమైన సంపద, భారీ ఆస్తులు కలిగి ఉన్నప్పటికీ ప్రపంచంలో అత్యంత ధనిక కుటుంబం మాత్రం కాదు. ఇటీవల ఒక సర్వేలే అత్యంత ధనిక రాజకుటుంబాలు మధ్యప్రాచ్య దేశాల కుటుంబాలుగా తేలింది. ఇక అత్యంత ధనిక రాజకుటుంబం సౌదీ అరేబియా రాయల్ ఫ్యామిలీ. సౌదీ రాజకుటుబం ఆస్తుల విలువ 1.4లక్షల కోట్ల అమెరికన్ డాలర్ల కంటే కూడా ఎక్కువే ఉంటుందట. కింగ్ సల్మాన్ బిన్ అబ్దుల్ అల్ సౌద్ నేతృత్వంలోని సౌదీ కుటుంబంలో 15వేల కంటే ఎక్కువ మంది సభ్యులు ఉన్నారు. సౌదీ కుటుంబం ప్రైవేట్ జెట్‌లు, బోట్స్, బంగారు పూతతో కూడిన కార్లతో పాటు అనేక ఖరీదైన వాహనాలను కలిగి ఉంది. సౌదీ కింగ్ అల్ యమామా ప్యాలెస్‌లో నివసిస్తున్నారు. ఈ ప్యాలెస్ 4 మిలియన్ల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించారు. దేశంలోని అతిపెద్ద చమురు క్షేత్రాల నుంచి వీరి అధిక మొత్తంలో సంపద వస్తుంది.


సౌదీ కుటుంబం తర్వాత అత్యంత ధనిక రాయల్ ఫ్యామిలీ కువైట్ రాజకుటుంబం. కువైట్ రాజకుటుంబం మొత్తం ఆస్తుల విలువ 360 బిలియన్ డాలర్లు. భారత కరెన్సీలో రూ.2,95,39,98,00,00,000. చార్లెస్ 3 నేతృత్వంలోని బ్రిటీష్ రాజకుటుంబం ప్రపంచంలో రిచెస్ట్ రాయలీ ఫ్యామిలీ లిస్ట్‌లో 5వ స్థానంలో ఉంది. బ్రిటీష్ రాజకుటుంబం సంపద 88 బిలియన్ డాలర్లు. భారత కరెన్సీలో రూ.7.22లక్షల కోట్లు.
