కె.విశ్వనాథ్‌గారి సినిమాలు మా జనరేషన్‌ని బాగా ఇన్‌స్పైర్ చేశాయి. ఆయన సినిమాల్లో మంజుభార్గవి, భానుప్రియ క్లాసికల్ డాన్సులు చూసి, డాన్స్‌మీద ఇష్టం పెరిగి, మేం కూడా క్లాసికల్ డాన్స్ నేర్చుకున్నాం. మన కళల్ని ముందు తరాలకు చేర్చగలిగాం. అలా ఇన్‌స్పైర్ చేసే సినిమాలు, కళా రూపాలు ఇప్పుడు రావాల్సిన అవసరం ఉంది అంటున్నారు నటి ప్రశాంతి హారతి. పెళ్లాం ఊరెళితే, ఇంద్ర చిత్రాలతో నటిగా గుర్తింపు తెచ్చుకున్న ఆమె పెళ్లి తర్వాత యూఎస్‌లో సెటిల్ అయ్యారు. అక్కడ ఓంకార అనే పేరుతో కూచిపూడి డ్యాన్స్ స్కూల్‌ని నడిపారు. ఇప్పటికీ తనకు నటనపై మక్కువ తగ్గలేదని, ఆ ప్యాషన్‌తోనే మళ్లీ టాలీవుడ్‌కి రావాలనుకుంటున్నానని చెబుతున్నారు ప్రశాంతి హారతి.
పెళ్లాయ్యాక యూఎస్‌లో సెటిల్ అయ్యాను. అక్కడి పిల్లలకు మన శాస్త్రీయ నృత్యాన్ని నేర్పుతున్నాను. నా కూతురు తాన్య కూడా నా స్టూడెంటే. తనకు నటనంటే ఇంట్రెస్ట్ ఉంది. తనకిప్పుడు 16ఏళ్లు. తన వయసుకు తగ్గ పాత్రలు లభిస్తే ప్రోత్సహించేందుకు సిద్ధంగా ఉన్నాం అని తెలిపారు. మంచి పాత్రలు లభిస్తే నటించా లని ఉందని, సినిమా లతోపాటు ఓటీటీ వెబ్‌సిరీస్, షార్ట్ ఫిల్మ్స్‌లో నటించాలని ఉందని, అందుకే హైదరాబాద్‌లో అందుబాటులో ఉండాలనుకుంటున్నానని ప్రశాంతి తెలిపారు.