Namaste NRI

డొనాల్డ్‌ షాక్‌.. అధ్యక్ష రేసులో నిక్కీ హేలీ తొలి విజయం

అమెరికాలో రిపబ్లికన్‌ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిత్వం ఆశిస్తున్న భారత సంతతికి చెందిన నిక్కీ హేలీకి తొలి విజయం లభించింది. వాషింగ్టన్‌ డీసీ ప్రైమరీ ఎన్నికల్లో తన ప్రత్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌పై ఆమె గెలుపొందా రు. దీంతో వరుస విజయాలతో దూసుకుపోతున్న ట్రంప్‌కు బ్రేక్‌ పడినట్లయింది.  అలాగే కీలకమైన సూపర్‌ ట్యూస్‌డే పోటీకి ముందు హేలీకి గొప్ప ఊతం లభించింది. రిపబ్లికన్‌ ప్రెసిడెన్షియల్‌ ప్రైమరీని గెలుచుకున్న తొలి మహిళగా హేలీ రికార్డు సృష్టించారు. అదేవిధంగా డెమొక్రాటిక్‌ లేదా రిపబ్లికన్‌ ప్రైమరీని గెలుచుకున్న తొలి ఇండియన్‌-ఆమెరికన్‌గా కూడా ఆమె నిలిచారు.

వాషింగ్టన్‌ డీసీలో ఉన్న 22 వేల ఓట్లలో నిక్కీ హేలీకి 63 శాతం ఓట్లు పోలయ్యాయి. ప్రత్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌నకు 33.2 శాతం ఓట్లు వచ్చాయి. ఇక ఇక్కడ 2020లో జరిగిన ప్రైమరీ ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు, డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్థి జో బైడెన్‌కు 92 శాతం ఓట్లు సాధించారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events