
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే భారత ఎగుమతులపై 50శాతం సుంకాలు విధించిన ట్రంప్ తాజాగా మరో నిర్ణయం తీసుకున్నారు. దాంతో భారతీయ చిత్రాలపై భారీ ప్రభావం పడనున్నది. అమెరికా వెలుపల నిర్మించే సినిమాలపై సుంకాలు అమలు చేయనున్నట్లు హెచ్చరించారు. వంద శాతం సుంకాలను విధించనున్నట్లు ప్రకటించారు. విదేశీ సినిమాలపై వందశాతం సుంకాలు అమలు కానున్నాయి. మా సినిమా నిర్మాణ వ్యాపారాన్ని అమెరికా నుంచి, ఇతర దేశాలను ఓ శిశువు నుంచి మిఠాయిని తొలగించినట్లుగా దొంగిలించాయని ఆయన ఆరోపించారు. బలహీన, అసమర్థ గవర్నర్ కారణంగా ప్రత్యేకంగా కాలిఫోర్నియా తీవ్రంగా నష్టపోయింది అని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఎన్నటికీ పరిష్కారం కాని ఈ సుదీర్ఘ సమస్యను పరిష్కరించేందుకు అమెరికా వెలుపల నిర్మించే సినిమాలపై 100 శాతం సుంకం విధిస్తున్నట్లు వెల్లడించారు.
















