
అమెరికా దేశాధ్యక్షుడిగా ఎన్నికైన డోనాల్డ్ ట్రంప్ శ్వేత సౌధంలో ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్‌ను కలుసుకు న్నారు. ఓవర్ ఆఫీసులో ఇద్దరూ భేటీ అయ్యారు. అధికార మార్పిడి గురించి చర్చించుకున్నారు. ఆ మీటింగ్‌కు చెందిన కొన్ని ఫోటోలను వైట్‌హౌజ్ రిలీజ్ చేసింది. శ్వేతసౌధంలో ఇద్దరూ షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. స్మూత్‌గా అధికార మార్పిడి జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మరో వైపు అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది. హౌజ్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌లో రిపబ్లికన్లు మెజారిటీ సాధించారు. గ్రాండ్ ఓల్డ్ పార్టీ 218 సీట్లు గెలుచుకున్నది.
