Namaste NRI

అమెరికా అధ్యక్షుడిగా డొనాల్ట్ ట్రంప్ ప్రమాణస్వీకారం

అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేశారు. దేశ అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణం చేయడం ఇది రెండో సారి. ట్రంప్తో అమెరికా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జాన్ రాబర్ట్స్ ప్రమాణం చేయించారు. అమెరికా ఉపాధ్యక్షుడిగా జేడీవాన్స్ ప్రమాణం చేశారు.అమెరికా ఉపాధ్యక్షుడిగా జేడీవాన్స్తో కూడా అమెరికా సుప్రీం ప్రధాన న్యాయమూర్తి ప్రమాణం చేయించారు. చలి కారణంగా క్యాపిటల్ హిల్స్ లోపల లోని రోటుండా హాలులో ప్రమాణ స్వీకార కార్యక్రమం ఏర్పాటు చేశారు. డొనాల్ట్ ట్రంప్ ప్రమాణ స్వీకారం సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు, పరేడ్లు నిర్వహించారు.


40 ఏళ్ల తర్వాత క్యాపిటల్ హిల్స్ లోని రోటుండా హాలులో లోపల ప్రమాణ స్వీకారం ఏర్పాటు చేయడం ఇదే మొదటి సారి. ఇంతకు ముందు 1985లో రొనాల్ట్ రీగన్ కూడా క్యాపిటల్ హిల్స్ లోపల అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు.ఈ కార్యక్రమానికి వివిధ దేశాల అధినేతలు హాజరయ్యారు.


భారత ప్రభుత్వం తరఫున విదేశాంగశాఖ మంత్రి జై శంకర్ హాజరయ్యారు. రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ దంపతులు, టెస్లా సీఈఓ ఎలన్ మస్క్, మెటా అధినేత మార్క్ జుకర్ బర్క్, అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్, ఓపెన్ ఏఐ సీఈఓ శామ్ ఆల్ట్మన్, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం నేపథ్యంలో 25 వేల మంది భద్రతా సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events