అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రెండోసారి దేశాధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన పలు కీలక పత్రాలపై ఆయన సంతకం చేశారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి అమెరికా ఉపసంహరించుకున్నట్లు ఆయన ఆదేశాలు జారీ చేశారు. వైట్‌హౌజ్ చేరుకున్న తర్వాత ఆయన పలు డాక్యుమెంట్ల పై సంతకం చేశారు. దాంట్లో డబ్ల్యూహెచ్‌వో ఉపసంహరణ ఆదేశాలు కూడా ఉన్నాయి.
డబ్ల్యూహెచ్‌వో నుంచి తప్పుకోవాలని ట్రంప్ ఆదేశాలు ఇవ్వడం ఇది రెండోసారి. కోవిడ్19 సమయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ సరైన రీతిలో వ్యవహరించలేదని గతంలో కూడా ట్రంప్ ఆరోపించారు. జెనీవాకు చెందిన ఆ సంస్థ సభ్యత్వం నుంచి వైదొలుగుతున్నట్లు గతంలోనూ వెల్లడించారు. కానీ బైడెన్ ఆ నిర్ణయాన్ని రద్దు చేశారు.