మాజీ అధ్యక్షుడు జో బైడెన్ పై ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ కంటే బైడెన్ పరిపాలన చాలా అధ్వానంగా ఉందంటూ విమర్శలు గుప్పించారు. అమెరికా చరిత్రలోనే బైడెన్‌ది చెత్త పరిపాలనగా అభివర్ణించారు. తన కంటే బైడెన్ చెత్త అధ్యక్షుడని తెలుసుకొని జిమ్మీ కార్టర్ సంతోషంగా కన్నుమూశారంటూ సంచలన వ్యాఖ్యాలు చేశారు.

వైట్‌హౌస్‌లోని ఓవల్ ఆఫీస్‌లో ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ తో సమావేశం అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మాజీ అధ్యక్షుడు జో బైడెన్ పరిపాలన చాలా భయంకరమైనది. వారు ఎన్నికల్లో మోసం చేయగలను. వారు చేయగలిగింది అంతే, అసమర్థులు. ప్రజలకు ఏమీ చేయలేకపోయారు. దేశ చరిత్రలోనే ఆయనది అత్యంత చెత్త పరిపాలన. జిమ్మీ కార్టర్ కంటే దారుణం. అందుకే తన కంటే బైడెన్ చెత్త అధ్యక్షుడని తెలుసుకొని జిమ్మీ కార్టర్ సంతోషంగా కన్నుమూశారు అని ట్రంప్ వ్యాఖ్యానించారు. అమెరికా మాజీ అధ్యక్షుడు, నోబెల్ శాంతి బహుమతి గ్రహీత అయిన జిమ్మీ కార్టర్(100) గతేడాదని డిసెంబర్ 30న కన్నుమూసిన విషయం తెలిసిందే.
